Tulja Bhavani Again Fires On Her Father Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవాని మరోసారి నిప్పులు చెరిగారు. తనపై ఎఫైఐఆర్ నమోదవ్వడంతో జనగామ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను చేర్యాల భూమిని మున్సిపాలిటీ ఇచ్చిన తర్వాత తన తండ్రి స్వాగతిస్తున్నానని అన్నారని, ఇప్పుడేమో కేసులు పెట్టి మళ్లీ తమను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. తాను ఆ భూమిని కబ్జా చేశానని తన తండ్రి ఓపెన్‌గా ఒప్పుకున్నారని.. మరి ఆయన తన పదవిలో ఎందుకు ఉన్నారు? రాజీనామా ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించారు. భూమి ఆయన కబ్జా చేశాడని, భూమి తాను ఇచ్చానని, కాబట్టి ఈ విషయంలో తండ్రి కూడా వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నకూతురిపై ఓ తండ్రి ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Terrorists: గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు కలకలం.. అలర్ట్ అయిన పోలీసులు..!
తమకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులూ అందలేదని, తమపై పెట్టిన కేసు గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చామని తుల్జా భవాని స్పష్టం చేశారు. అయినా.. భూమి ఇచ్చాక అసలు కేసులు ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. భూమి కబ్జా చేసింది తన తండ్రి కాబట్టి.. విచారణలో ఆయన ఉండాలి కానీ, తాను కాదని చెప్పారు. తన తండ్రి ఆరోపణలు చేస్తున్నట్టు తాను ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోలేదని క్లారిటీ ఇచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాతే తాను తండ్రితో కలిసి మాట్లాడానని.. మరి అది కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎలా అవుతుందని తిరిగి ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో తన తండ్రి చేసిన తప్పులపై మాట్లాడుతున్నందుకే ఆయన హైకోర్టును ఆశ్రయించాడని తెలిపారు. తన కూతురు ఇలా అందరి ముందు అడగొద్దని తండ్రి పిటిషన్ పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని, తన కెరీర్‌తో తాను సంతోషంగానే ఉన్నానని తుల్జా భవాని స్పష్టం చేశారు.
Sangareddy Crime: చెల్లిని ప్రేమిస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య