Ladies Special: అమ్మాయి బస్సు జర్నీ చేయాలంటే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే కొందరు ఆకతాయిలు అమ్మాయిలను ఆటపట్టిస్తూ.. వెకరి చేష్టలు చేస్తూ వారితో మిస్ బిహేవ్ చేస్తుంటారు. అంతేకాకుండా బస్సులో సీటు దొరక్క స్టాండింగ్ లో వుంటే ఇక చెప్పనక్కర్లేదు.. వెనుక నుంచి అమ్మాయిలను పట్టుకోవడం, చేతులు తాకడం వంటివి చేస్తుంటారు. ఇక సీటులో కూర్చున్న కూడా మహిళలకు సతాయిస్తూ టీజింగ్ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీస్ శుభవార్త చెప్పింది. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది.
Read also: Dharmana Prasada Rao: పాలనా రంగంలో సరికొత్త మార్పులు.. పేదలకు అండగా సీఎం జగన్
అమ్మాయిలకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని విధాలా కృషి చేస్తున్న టీఎస్ ఆర్టీసీ ఇప్పటికే పలు సేవలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సును ఏర్పాటు చేసింది. ఈ మహిళా ప్రత్యేక బస్సు JNTU నుండి వేవ్ రాక్ మార్గంలో ఉదయం మరియు సాయంత్రం నడుస్తుంది. ఈ నెల 31 నుంచి ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో మహిళలు పడుతున్న ప్రయాణ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రత్యేక బస్సును అందుబాటులోకి తెస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే..ఈ ప్రత్యేక బస్సు.. ఉదయం 9:05 గంటలకు జేఎన్‌టీయూ నుంచి బయలుదేరి.. ఫోరమ్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్ రోడ్, ఇందిరా నగర్, ట్రిపుల్ ఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ మీదుగా అలలింది. టవర్లు రాక్ చేరతాయి. మళ్లీ సాయంత్రం వేవ్ రాక్ నుంచి అదే మార్గంలో తిరిగి 5 గంటల 50 నిమిషాలకు జేఎన్టీ చేరుకుంటారని వివరించారు. మహిళా ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సు సర్వీసును వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు.
Kishan Reddy: యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటన
