Site icon NTV Telugu

Tsrtc Md Sajjanar: ప్ర‌యాణికుల‌కు బంపరాఫర్! పేరు చెప్తే బ‌హుమతి అంటూ ట్వీట్

Sajjanar

Sajjanar

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీగా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ రూపు రేఖలు మార్చే పనిలో నిమ‌గ్న‌మ‌య్యారు. మూస పద్ధతిలో కాకుండా.. వినూత్న ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకుపోతున్నారు. నష్టాల బాటలో పయనిస్తున్న సంస్థను గాడిన పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు అమలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

అమెజాన్ క్లియరెన్స్ స్టోర్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇంకా మరెన్నో వాటిపై 40% వరకు తగ్గింపు ప్రయాణికుల కోసం వాటర్ బాటిళ్లను తయారుచేసి విక్రయించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ.. ఈ విషయాన్ని సజ్జనార్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్‌తో పాటు డిజైన్ సూచించండంటూ ప్రయాణికులను కోరారు. ఎవరైతే బెస్ట్ డిజైన్‌తో పాటు టైటిల్ పంపుతారో వారికి బహుమతి కూడా ఇవ్వనున్నట్లు వివరించారు.

‘ప్రయాణికుల కోసం 500 ఎంఎల్, 1 లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించబోతున్నాం.. వాటర్ బాటిల్‌కు మంచి టైటిల్‌తో పాటు డిజైన్‌ను సూచించగలరు. ఉత్తమ టైటిల్‌తో డిజైన్‌ను సూచించిన వారికి బహుమతి కూడా ఇవ్వబోతున్నాం. మీ సూచనలను మా వాట్సాప్ నంబర్ 94409 70000‌కు పంపండి’ అంటూ ట్వీట్ చేశారు.

అలాగే.. ‘TSRTC చేసే చారిత్రాత్మక మార్పునకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. వాటర్ బాటిల్‌కు మంచి పేరు, డిజైన్ చెప్పండి. రివార్డ్స్ గెలుచుకోండి’ అంటూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించిన పోస్టర్లను ట్వీట్‌కు జత చేశారు సజ్జనార్.

Sandra Venkata Veeraiah: ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సండ్ర

Exit mobile version