Sajjanar: హైదరాబాద్ శివార్లలోని సన్ సిటీ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరమని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. హైదరాబాద్ శివారులోని సన్ సిటీ సమీపంలో నిన్న జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరం. ఓ యువకుడి అజాగ్రత్త, మితిమీరిన వేగం.. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఓ అమాయక తల్లీకూతుళ్లను బలిగొంది. మరో ఇద్దరు గాయపడ్డారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చి మరీ ప్రేమతో రోడ్లపైకి పంపితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అంటూ ట్వీట్ చేశాడు.
Read also: Astrology: జూలై 06, గురువారం దినఫలాలు
హైదరాబాద్ శివారులోని బండ్లగూడలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిలోని ఆర్మీ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద మార్నింగ్ వాక్ కు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను కారు ఢీకొట్టింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు అనురాధ , మమత మృతి చెందగా.. మరో మహిళ కవితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సీఎన్‌టీ కాలనీకి చెందిన ఇంతియాజ్ ఆలం ఖాన్‌ను కూడా కారు ఢీకొట్టింది. కవిత, అలంఖాన్‌లను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కవిత అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి 19 ఏళ్ల బద్రుద్దీన్ ఖాదిరీ కారణమని పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన బద్రుద్దీన్ ఖాదిరీకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బద్రిద్దీన్ పుట్టినరోజు మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. పుట్టిన రోజు వేడుకల కోసం కారులో బయల్దేరిన సంగతి తెలిసిందే.
Minister KTR: నేడు సిరిసిల్లకు కేటీఆర్..1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ