NTV Telugu Site icon

నల్గొండ ఆర్టీసీ డిపోల్లో సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు.. ఇక, నల్గొండ ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు చేవారు సజ్జనార్‌.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. రైతులకు కూడా ఉపయోగపడేలా కార్గో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ పై భారం పడిందన్న ఆయన.. సురక్షితంగా ప్రయాణం ఆర్టీసీ బస్సుతోనే సాధ్యం, మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సు వెళ్తుందని గుర్తుచేశారు.

ఎలాంటి అడ్వాన్స్ లేకుండా ఫోన్ చేస్తే వారి వద్దకే వెళ్లి బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం కలిపిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. బస్టాండ్ ఆవరణలో, ఆర్టీసీ ఆస్తులపై సినిమా, అనుమతి లేని పోస్టర్లు ఉంచితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించిన ఆయన.. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లో కేసులు నమోదు చేశామన్నారు.. కాగా, ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు కొంత సమయాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే.. ఆర్టీసీకి పూర్వ వైభవం రాకపోతే.. ప్రైవేటీకరణకు కూడా వెనుకాడబోమని ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు కూడా ఇచ్చింది.