Site icon NTV Telugu

TSRTC: ఆర్టీసీ ఉగాది ఆఫర్.. వారికి ఉచిత ప్రయాణం

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత… వినూత్న తరహాలో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టించే పనిలో పడిపోయారు సజ్జనార్‌.. ఇక, ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేక ఉన్నా..? ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు తీసుకున్నారు.. తాజాగా మరో ఆఫర్‌ తీసుకొచ్చింది టీఎస్‌ఆర్టీసీ… ఉగాది పండుగ సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చింది..

Read Also: AP: విద్యుత్ ఛార్జీల సవరణతో ప్రజలపై భారం స్వల్పమే-ట్రాన్స్‌కో

అయితే, ఉగాది పండగ సందర్భంగా కేవలం ఏప్రిల్‌ 2వ తేదీన.. అంటే పండుగ రోజు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం సౌలభ్యం ఉంటుంది.. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ తీసుకొచ్చినట్టు వెల్లడించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

Exit mobile version