NTV Telugu Site icon

VC Sajjanar: అభిమానం పేరుతో పిచ్చి చేష్టలా.. బస్సులపై దాడి కరెక్ట్‌ కాదన్న సజ్జనార్

Vc Sajjanar

Vc Sajjanar

VC Sajjanar: యూట్యూబర్, రైతు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. దీనితో, బిగ్ బాస్ చరిత్రలో కామన్మాన్ కేటగిరీలో గెలిచిన మొదటి కంటెస్టెంట్‌గా రికార్డుల్లో నిలిచాడు. సీరియల్ నటుడు అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించగానే సంబరాలు మిన్నంటాయి. అయితే ఇద్దరి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పరం దాడులకు దారితీసింది. ఒకరినొకరు పిడిగుద్దులు కొట్టుకున్నారు. అంతేకాకుండా.. టిఎస్‌ఆర్‌టిసికి చెందిన 6 సిటీ బస్సులపై దాడి చేసి వాటి అద్దాలు పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

Read also: Hanuman: శ్రీరాముని ఆశీస్సులు కూడా అందాయి… ఇక ట్రైలర్ రావడమే లేట్

సజ్జనార్ ట్విట్..

బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఎఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. TSRTC యాజమాన్యం ఇలాంటి సంఘటనలను ఉపేక్షించదు. TSRTC బస్సులు ప్రజల ఆస్తి. వాటిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

Show comments