Site icon NTV Telugu

Sajjanar: టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. ఇకపై ఫ్యామిలీ టికెట్ల నిలిపివేత..

Tsrtc

Tsrtc

Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసిన ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1, 2024 నుంచి ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లు జారీ చేయాలంటే కండక్టర్లు వారి గుర్తింపు కార్డులను చూడాలి. ప్రయాణికులు తమ వయస్సును నమోదు చేసుకోవాలి.మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో కండక్టర్లు ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లు ఇచ్చేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు.దీంతో ప్రయాణ సమయం సేవలు కూడా పెరుగుతున్నాయి. “అసౌకర్య కారణాల దృష్ట్యా కుటుంబ-24 మరియు T-6 టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఈ టిక్కెట్లు సోమవారం (జనవరి 1, 2024) నుండి జారీ చేయబడవు” అని TSRTC MD సజ్జనార్ ప్రకటించారు.

Read also: Allu Arjun: ఈ ఏడాది ఐకాన్ స్టార్ దే…

ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని ఆటో డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు శత్రువులుగా చూస్తే వారిపై దాడి చేస్తున్నారు. అయితే కొత్తగూడెంలో బస్సు డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్ను ప్రయాణికులు దూషించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లైన సిబ్బందిని దూషించడం, దాడులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఏమాత్రం సహించదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొందరు అధికారులు స్థానిక పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. డ్రైవర్లపై, కండెక్టర్లపై దాడి చేస్తే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లు సహనం పాటించాలని కోరారు. మాటి మాటికి ఇదే రిపీట్ అయితే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Darshan: కర్ణాటకలో సలార్ స్పీడుకి బ్రేకులు పడ్డాయ్…

Exit mobile version