NTV Telugu Site icon

Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. RTC బస్ టికెట్‌తో పాటే దర్శన టికెట్ బుకింగ్‌..

Srisailam Darshanam

Srisailam Darshanam

Srisailam Darshan: హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు తీసుకునే వారికి శ్రీశైలం ఆలయంలో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. 1,200 రోజువారీ దర్శన టిక్కెట్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 200 స్పర్శ దర్శనం టిక్కెట్లు, 500 సూపర్ క్విక్ దర్శన్ టిక్కెట్లు, మరో 500 క్విక్ దర్శనం టిక్కెట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఎంవోయూ కుదిరింది. స్పర్శ దర్శనం టిక్కెట్ ధర రూ.500, శీఘ్ర దర్శనం ధర రూ.300, శీఘ్ర దర్శనం ధర రూ.150 అని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను సీఎం రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

Read also: Lord Surya Stotram: ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యం కలిగేలా ఆదిత్యుడు ఆశీర్వదిస్తాడు

90 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60 రోజుల్లోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహిళలతో కలిసి రూ.535 కోట్ల చెక్కును టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు తిరుగుతాయని.. వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్ నుంచి రూ.700, రూ.510లను ఆర్టీసీ ఖరారు చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ ఎం శ్రీధర్ తెలిపారు.
Surya Stotram: ఆయురారోగ్య‌ ప్రాప్తి, సకల సౌభాగ్యాలకు ఈ స్తోత్ర పారాయణం చేయండి