NTV Telugu Site icon

TSPSC Paper Leak Case: కరీంనగర్ చుట్టూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. ఇద్దరు అరెస్టు

Tspsc

Tspsc

TSPSC Paper Leak Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కదారి పట్టినట్లు నిందితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మరోసారి ఈ వ్యవహారం కరీంనగర్ చుట్టూ తిరుగుతోంది. కరీంనగర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న విశ్వప్రసాద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లును సిట్‌ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్టుల సంఖ్య 53కి చేరింది. వీరిద్దరూ హైటెక్ మాస్ కాపీయింగ్‌లో నటీనటులు. పూల రమేష్ తో డీఈఈ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని ఏఈఈ, డీఏవో పరీక్షలకు ప్రశ్నపత్రం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున డీల్ జరిగినట్లు సిట్ విచారణలో తేలింది. క్వశ్చన్ పేపర్ లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ కేసుల్లో మరో 50 మంది వరకు నిందితులుగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Read also: Ashu Reddy: కాళ్లకు పెట్టుకునే పట్టీలేంటి పిల్ల అక్కడ పెట్టుకున్నావ్

ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన చాలా మందికి బెయిల్ రాగా ఇటీవల మరో ఇద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. మహబూబ్ నగర్ కు చెందిన మైబయ్య తన కొడుకు జనార్దన్ కోసం డాక్వా నాయక్ నుంచి రూ.2 లక్షలకు పేపర్ కొనుగోలు చేశాడు. సిట్ విచారణలో ఈ విషయం తేలడంతో అరెస్ట్ చేయగా రూ.50 వేల పూచీకత్తుతో ఇద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఇప్పటివరకు బెయిల్ పొందిన వారి సంఖ్య 17కు చేరింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ లకు మాత్రం బెయిల్ లభించకపోవడంతో జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రేణుకకు ఇటీవల బిగ్ రిలీఫ్ లభించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు రేణుకకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు మాత్రం కొన్ని షరతులను విధించింది. రూ.50 వేల పూచీకత్తుతో రేణుకకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో సిట్ అధికారుల ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు TSPSC పేపర్ లీకేజి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ పేపర్ కొనుగోలు చేసిన పలువురిని అరెస్ట్ చేసింది. అలాగే ఇప్పటివరకు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇక తాజాగా ఈ కేసులో మరో నలుగురిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పేపర్ లీకేజి కేసులో ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
Virat Kohli Out: ఉనాద్కత్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్‌!