NTV Telugu Site icon

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. కస్టడీకి 9మంది నిందితులు

Tspsc Accused Custody

Tspsc Accused Custody

TSPSC Paper Leak Accused Handed Over To SIT For 6 Six Days Custody: TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన అనుమతితో.. చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మంది అధికారుల్ని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలుత సిట్ అధికారులు 10 రోజుల పాటు నిందితుల కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ వేయగా.. ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, ఆరు రోజుల పాటు అంటే మార్చి 23వ తేదీ వరకు వారిని విచారించనున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలపై కూపి లాగనున్నారు. ప్రశ్నాపత్రం ఎవరెవరికి విక్రయించారనే దానిపై ఆరా తీయనున్నారు.

Boyfriend Suicide: ప్రియురాలు మాట్లాడట్లేదని.. ఉరేసుకున్న టెక్కీ

ఇదిలావుండగా.. అంతకుముందు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్‌పీఎస్‌సీకి ఇచ్చిన నివేదికలో సిట్ కొన్ని కీలక విషయాల్ని వెల్లడించింది. ఈ లీకేజ్‌లో ప్రధాన సూత్రధారి రాజశేఖరే అని, ఉద్దేశపూర్వకంగానే అతడు పేపర్ లీక్ చేశాడని అధికారులు తేల్చారు. సిస్టమ్ ఆపరేటర్‌గా పని చేస్తున్న రాజశేఖర్.. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి, పాస్‌వర్డ్‌ని తొలగించినట్టు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేసి, ఆ పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కి ఇచ్చినట్టు చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీనే ఏఈ పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేశాడని, ఆ పేపర్‌ను రేణుకకు ప్రవీణ్ అమ్మాడని వెల్లడించారు. అదే సమయంలో గ్రూప్-1 ప్రశ్నాపత్ర కూడా లీకైనట్టు అధికారులు గుర్తించారు. సెక్రటరీ దగ్గర పని చేస్తున్న ప్రవీణ్.. గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు సిట్ నిర్ధారించింది. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని విచారించి.. ఈ లీకేజ్ వెనుక ఉన్న ప్రతీ సమాచారాన్ని బయటకు లాగేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.

Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్‌ను చంపడమే నా జీవిత లక్ష్యం.. జైలు నుంచే బిష్ణోయ్ బెదిరింపు

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులోని నిందితులు:
ఏ -1 ప్రవీణ్ కుమార్, ఏ -2 అట్ల రాజశేఖర్, ఏ -3 రేణుక రాథోడ్, ఏ -4 డాక్య, ఏ- 5 కేతావత్ రాజేశ్వర్, ఏ -6 కేతావత్ నీలేష్ నాయక్, ఏ -7 పత్లావత్ గోపాల్ నాయక్, ఏ -8 కేతావత్ శ్రీనివాస్, ఏ -9 కేతావత్ రాజేంద్ర నాయక్.

Show comments