నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మరో నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)… మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 13వ తేదీ (13-09-2022) నుంచి వచ్చే నెల 10వ తేదీ (10-10-2022) వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించాలని తన ప్రకటనలో పేర్కొంది టీఎస్‌పీఎస్సీ… ఇక, దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వెల్లడించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా, అసెంబ్లీ వేదికగా 90 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన తర్వాత.. కొంత గ్యాప్ తీసుకుని.. ఖాళీల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.
Read Also: Delhi Lieutenant Governor: ఆప్ నేతలకు ఢిల్లీ ఎల్జీ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?
