TSPSC Group-2 Exam: ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో.. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంప్రదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో… గ్రూప్-2 అభ్యర్థుల పోరు ఫలించినట్లే.
Read also: Shiva Abhishekam: గ్రహబాధల నుంచి ఉపశమనం కలగాలంటే ఈ అభిషేకం వీక్షించండి
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసి.. మళ్లీ నవంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శులు సీఎం కేసీఆర్ సమీక్షించారు. గ్రూప్-2 పరీక్షలను నవంబర్‌కు వాయిదా వేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, గ్రూప్-2 పరీక్షను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన తెలిపారు. మరోవైపు.. 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆగస్టు 14న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని టీఎస్పీఎస్సీ తెలిపిన సంగతి తెలిసిందే.. మరోవైపు అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Tata Technologies IPO: 20ఏళ్ల తర్వాత టాటా ఐపీవో బూమ్.. గ్రే మార్కెట్‌లో ప్రీమియం రికార్డు
గ్రూప్-2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం ముందస్తుగా నిర్ణయించింది. కాగా, ఇదే నెలలో గురుకుల పరీక్షలతో పాటు మరికొన్ని పోటీ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు కూడా గురుకుల పరీక్షలకు పోటీ పడుతుండడంతో.. పూర్తిగా దేనికి సన్నద్ధం కాలేకపోతున్నామని పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వాదిస్తూ వచ్చారు. అయితే, ఆ వాదనకు బలం చేకూర్చేలా రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు తమ గళం వినిపించడంతో నిన్నటి నుంచి వారి పోరు ఊపందుకుంది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట వేలాది మంది అభ్యర్థులు గుమిగూడారు. ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతు పలికాయి. అధికారులు స్పందించకపోవడంతో 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు టీఎస్ పీఎస్సీపై అసహనం వ్యక్తం చేసింది. కాగా, సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని TSPSC తెలిపింది.
Astrology: ఆగస్టు 13, ఆదివారం దినఫలాలు
