గ్రూప్ -1 పోస్టుల నోటిఫికేషన్ దరఖాస్తు గడువు నేటితో యుగియనుంది. వాస్తవానికి మే నెలాఖరుతో తుది గడువు ముగియగా.. అభ్యర్థులకు మరో అవకాశం కల్పించిన టీఎస్‌పీఎస్సీ జూన్ 4 వరకు అవకాశం కల్పించింది. మొత్తం 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగా, మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ పేమెంట్, సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్‌పీఎస్సీ గడువును నాలుగు రోజులు పొడిగించింది. అయితే నేటితో గ్రూప్ 1 దరఖాస్తుల తుది గడువు ముగియనుంది. శనివారం 4వ తేదీ రాత్రి 11:59 వరకు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇదే తుది గడువు కావడంతో నేడు మరికొన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉంది.
గ్రూప్ -1 పోస్టులు శాఖలవారీగా వివరాలు
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు – 5
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు – 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పోస్టులు – 20
డీఎస్పీ పోస్టులు – 91
జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు – 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టులు – 8
జిల్లా ఉపాధి అధికారి పోస్టులు – 2
జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు – 6
గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు – 35
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు – 121
జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు – 5
సీటీఓ పోస్టులు – 48
డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు – 42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు – 26
ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు – 4
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు – 2
