NTV Telugu Site icon

TSPSC AEE: ఏఈఈ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఆ టైం దాటిందో గేట్లు క్లోజ్

Tspsc Aee

Tspsc Aee

TSPSC AEE: ఏఈఈ పోస్టుల రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పావుగంట ముందుగానే గేట్లు క్లోజ్ చేయనున్నారు అధికారులు. ఒక్కనిమిషం ఆలస్యమైన లోనికి అనుమంతబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించాలని రాత పరీక్షలు ముందుగానే చేరుకోవాలని కోరారు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జనవరి 22న జరగనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈనెల 17న TSPSC విడుదల చేసిన విషయం తెలిసిందే.. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. AEE ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TSPSC ID, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

షెడ్యూల్‌ ఇదే..

జనవరి 22న మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి కనీసం 45 నిమిషాల ముందు అభ్యర్థులు తమ నిర్దేశిత పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TSPSC సూచించింది. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఓఎమ్‌ఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌- 2 పరీక్ష ఉంటుందని వివరించారు…పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు పేపర్-1కు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకే అనుమతిస్తామని ఆ తరవాత గేట్లు మూసివేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ; పేపర్-2 ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పరీక్షా కేంద్రాలు ఉంటాయని అభ్యర్థులు గమనించాలని సూచించారు.

రాత పరీక్ష విధానం:

రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ , జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు. పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 3 న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మిషన్ భగీరథ, నీటిపారుదల, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గిరిజన సంక్షేమం, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో వీటిని భర్తీ చేస్తారు. AEE పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమైంది.
Master Plan: ఆందోళన వద్దు మాస్టర్ ప్లాన్ రద్దు చేసాం.. మున్సిపల్ పాలకవర్గాలు తీర్మానం