NTV Telugu Site icon

ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం

intermediate board

intermediate board

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప్రవేశాల గ‌డువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. చాలా మంది విద్యార్థులు కాలీజీల్లో ఇంకా చేరని పరిస్థితులు లున్నాయి.. అయితే, తెలంగాణ ప్రైవేట్‌ జూనియ‌ర్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేష‌న్.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో.. న‌వంబ‌ర్ 12వ తేదీ వ‌ర‌కు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఇంటర్‌ బోర్డు.. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, కో-ఆపరేటివ్‌, టీఎస్‌ రెసిడిన్షియల్‌, టీఎస్‌ సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, టీఎస్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌, టీఎస్‌ మోడల్‌, టీఎస్‌ బీసీ వెల్ఫేర్‌, మైనార్టీ వెల్ఫేర్‌, కేజీబీవీ, ఇన్సెంటివ్, కంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో.. ఈ నెల 12వ తేదీ వరకు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో అడ్మిషన్‌ పొందే అవకాశం లభించింది.