TS SSC Results: ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ టెన్త్ సప్లిమెంటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. నేడు ఉదయం 11:30 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. అయితే.. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది పరీక్షలకు హాజరు కాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈనేపథ్యంలో.. మొత్తంగా టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రయివేటు విద్యార్థుల విషయానికి వస్తే 819 మంది హాజరు కాగా, 425 మంది పాసయ్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. ఈనేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే.. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. కాగా.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. జూలై 18వ తేదీ లోపు ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది.
దానికి సంబంధించిన టైంటేబుల్ ను విడుదల చేసింది. ఆగస్టు 1 – ఫస్ట్ లాంగ్వేజ్, ఆగస్టు 2 – సెకండ్ లాంగ్వేజ్ నిర్వహించగా, ఇక ఆగస్టు 3 – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్) పేపర్ , ఆగస్టు 4 – మ్యాథమేటిక్స్ కాగా.. ఆగస్టు 5 – జనరల్ సైన్స్(ఫిజికల్ సైన్స్, బయాలజీ), ఆగస్టు 6 – సోషల్ స్టడీస్, ఆగస్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1, ఆగస్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ను నిర్వహిస్తారని వెల్లడించారు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!