Site icon NTV Telugu

TS SSC Results: ఆగ‌స్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ టెన్త్ స‌ప్లిమెంట‌రీ

Sabitha.. Agust

Sabitha.. Agust

ఇవాళ తెలంగాణలో పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. నేడు ఉద‌యం 11:30 గంట‌ల‌కు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అయితే.. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా.. 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఈనేప‌థ్యంలో.. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించగా.. ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారని మంత్రి తెలిపారు. ఈనేప‌థ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే.. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు. కాగా.. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. జూలై 18వ తేదీ లోపు ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ వెల్ల‌డించింది.

దానికి సంబంధించిన టైంటేబుల్ ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 1 – ఫ‌స్ట్ లాంగ్వేజ్, ఆగ‌స్టు 2 – సెకండ్ లాంగ్వేజ్ నిర్వ‌హించ‌గా, ఇక ఆగ‌స్టు 3 – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌) పేప‌ర్ , ఆగ‌స్టు 4 – మ్యాథ‌మేటిక్స్ కాగా.. ఆగ‌స్టు 5 – జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ), ఆగ‌స్టు 6 – సోష‌ల్ స్ట‌డీస్, ఆగ‌స్టు 8 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1, ఆగ‌స్టు 10 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2 ను నిర్వ‌హిస్తార‌ని వెల్ల‌డించారు.

Maharashtra Political Crisis: ఫడ్నవీస్, షిండే మధ్య కీలక చర్చలు

Exit mobile version