NTV Telugu Site icon

TS SSC Recounting: టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తుకు గడువు మే 15..

Ts Ssc Recounting

Ts Ssc Recounting

TS SSC Recounting: పదో తరగతి ఫలితాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామని విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. రీకౌంటింగ్ కోసం విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. రీవెరిఫికేషన్, డూప్లికేట్ ప్రశ్నపత్రాల కోసం, ఒక సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి. నిర్ణీత రుసుమును మే 15లోగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కాగా.. తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ రూల్ నంబర్ లేదా హాల్ టికెట్ వివరాలను నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ అడ్మిషన్ల సమయంలో ఈ చిన్న మెమోలు ఉపయోగపడతాయి. ఒరిజినల్ మెమోలను త్వరలోనే ఆయా పాఠశాలలకు పంపనున్నారు.

Read also: Dulam Nageswara Rao: దూలం నాగేశ్వరరావుకు మద్దతుగా కుటుంబ సభ్యుల ప్రచారం..

అయితే పదో తరగతి ఫలితాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాలని, రీవెరిఫికేషన్, డూప్లికేట్ ప్రశ్నపత్రాల కోసం, ఒక సబ్జెక్టుకు రూ.1000 మే 15లోగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇక విద్యార్థులు హాల్ టిక్కెట్లతో పాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకంతో కూడిన దరఖాస్తు ఫారాన్ని డీఈవో కార్యాలయానికి పంపాలన్నారు. వీటిని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కొరియర్, పోస్ట్ దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు నిర్ణయించారు. అయితే టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతి ఫలితాల్లో 99.05 శాతంతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 98.65 శాతంతో సిద్దిపేట రెండో స్థానంలో, 98.27 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
T20 World Cup 2024: ప్యాట్ కమిన్స్‌కు షాక్.. ప్రపంచకప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే!