NTV Telugu Site icon

Vande Bharat train: ప్రియమైన బర్రెలు.. అటు వెళ్లకండి.. అది చాలా వీక్

Ts Redco Chairman Y Satish Reddy

Ts Redco Chairman Y Satish Reddy

TS Redco Chairman Y Satish Reddy appeals to Buffalo not to obstruct Vande Bharat trains: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి నిరసన తెలిపారు. వందేభారత్ రైలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 68 ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొట్టడంతో వందే భారత్ రైలు దెబ్బతింది. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెకు విజ్ఞప్తి చేశాడు. “మోదీ గారూ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. వందే భారత్ రైళ్లు చాలా వీక్. దయచేసి ఆ వైపు వెళ్లకండి. పొరపాటున ముట్టుకున్నా రైలు పాడయ్యే ప్రమాదం ఉంది.” అని తెలిపారు. ‘‘అసలే ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉన్నాయి..

Read also: PM Modi Hyderabad tour: మోడీ వేదిక పై ఆ ఇద్దరికీ సీట్లు.. వాళ్ళు వెళతారా మరి?

దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మోడీ.. వందే భారత్ పేరుతో గేదెలు తాకేతేనే ధ్వంసం అయ్యే రైళ్లను తీసుకొచ్చారు.. అలాంటి రైళ్లతో.. వాటికే కాదు మీరు కూడా రిస్క్‌లో ఉన్నారు. మోడీ వాటిని ప్రారంభించడం ఆపే అవకాశం లేదు. కాబట్టి మీరైనా అటువైపు వెళ్ళకుండా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ బంధువులకు చెప్పి వందే భారత రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూసుకోండి” అని సతీష్ రెడ్డి గేదెలకు విజ్ఞప్తి చేశాడు. దీంతో వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. గేదె ఢీకొట్టడంతో వందే భారత్‌ రైళ్లు చిద్రమైపోతున్నాయని అంటూ పాంప్‌ లేట్‌ లతో నిరసన తెలిపిన తీరు చర్చకు దారితీస్తున్నాయి. వందేభారత్‌ రైల్లు చాలా వీక్‌ అని పాంప్‌ లెట్‌లలొ వినూత్నంగా నిరసనలు తెలిపారు.
Amaravati JAC: మలిదశ ఉద్యమానికి అమరావతి జేఏసీ శ్రీకారం