TS Polycet 2022: రేపే పాలిసెట్ పరీక్ష.. ఈ నిబంధనలు తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలీసెట్-2022) పరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలోని 3 సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశం కోసం జూన్ 30న ఉదయం 11.00 గం. నుంచి మ.1.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు కన్వీనర్ తెలిపారు. పాలీసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా హాల్ టికెట్లను పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలని, కోవిడ్ నిబంధనలను విధిగా పాటించవల్సి ఉంటుందని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు. పరీక్ష ముగిసిన అనంతరం12 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,13,974 మంది అభ్యర్థులు 365 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి ఒక గంట ముందుగానే అనగా ఉదయం 10.00 గంటలకే అనుమతిస్తారు. కావున విద్యార్థులు ఉ.10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓఎంఆర్ షీట్‌లోని రెండు వైపులలోని వివరాలు పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుంది. విద్యార్థులు తమవెంట హెబీ బ్లాక్ పెన్సిల్, రబ్బరు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నును తీసుకురావాలని అధికారులు వెల్లడించారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్బీటీఈటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. పాలీసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో నడుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ పాలీసెట్ 2022కు సంబంధించిన తాజా అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!