NTV Telugu Site icon

TS Polycet 2022: రేపే పాలిసెట్ పరీక్ష.. ఈ నిబంధనలు తప్పనిసరి..

Polycet Exam

Polycet Exam

రాష్ట్రంలో రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (పాలీసెట్-2022) పరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలోని 3 సంవత్సరాల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశం కోసం జూన్ 30న ఉదయం 11.00 గం. నుంచి మ.1.30 వరకు ఈ పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు కన్వీనర్‌ తెలిపారు. పాలీసెట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా హాల్‌ టికెట్లను పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలని, కోవిడ్‌ నిబంధనలను విధిగా పాటించవల్సి ఉంటుందని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు. పరీక్ష ముగిసిన అనంతరం12 రోజులకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,13,974 మంది అభ్యర్థులు 365 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి ఒక గంట ముందుగానే అనగా ఉదయం 10.00 గంటలకే అనుమతిస్తారు. కావున విద్యార్థులు ఉ.10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓఎంఆర్ షీట్‌లోని రెండు వైపులలోని వివరాలు పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుంది. విద్యార్థులు తమవెంట హెబీ బ్లాక్ పెన్సిల్, రబ్బరు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నును తీసుకురావాలని అధికారులు వెల్లడించారు.

2022-23 విద్యా సంవ‌త్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్‌బీటీఈటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. పాలీసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో న‌డుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భ‌ర్తీ చేయ‌నున్నారు. తెలంగాణ పాలీసెట్ 2022కు సంబంధించిన తాజా అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్‌ చేసుకోవచ్చు.