Site icon NTV Telugu

TS Poly CET : రేపు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు

Ts Polycet 2022

Ts Polycet 2022

రేపు ఉదయం 11.30 గంటలకు టీఎస్‌ పాలిసెట్ – 2022 ఫలితాలు విడుదల టీఎస్‌ పాలిసెట్‌ అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం నాంప‌ల్లిలోని టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు అధికారులు. అయితే.. జూన్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇంజ‌నీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలీసెట్‌లో అర్హత సాధించడం అవసరం.

 

పాలిసెట్ ద్వారా పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సెకండ్ ఫిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లోని సీట్లను భ‌ర్తీ చేస్తారు అధిరారు. బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో కూడా పాలిసెట్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు.

 

Exit mobile version