Telangana BJP chief Bandi Sanjay arrested: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రచార పర్వం ముగియడంతో.. ఇక అందరూ గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా.. గెలుపు తమదంటే తమదంటూ అన్ని పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. ఇక పోలింగ్ కు కొన్ని గంటల సమయం ఉండగా.. అర్థరాత్రి నల్గొండ హైవే పై హైడ్రామా నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్ నుండి మునుగోడుకు బయలుదేరారు. కానీ విషయం తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు. కానీ కార్యకర్తల సహాయంతో ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్ళింది. బండి సంజయ్‌తో పోలీసులు చర్చలు జరిపారు. అయినా ముందుకు కారును తీసుకువెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.
Read also: Naga Chaitanya – Samantha : సమంతను కలిసిన నాగచైతన్య.. నేనున్నానంటూ భరోసా
దీంతో పోలీసు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నడి రోడ్డు పై ధర్నాకు కూర్చున్న బండి సంజయ్. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆప్రాంతంలో భారీగా చేరుకున్న టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు బండి సంజయ్ ని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అబ్దుల్లాపుర్ మెట్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడులో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి అన్నది మాఉద్దేశమన్నారు. కేసీఆర్ గుండాలు అక్కడ ఇంకా ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేశారని విమర్శించారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మేము మునుగోడు ఖచ్చితంగా వెళ్లి తీరుతామన్నారు. అరెస్ట్ లు మమ్మల్నీ ఆపలేవని బండిసంజయ్ మండిపడ్డారు. కొంత మంది పోలీసులు దగ్గరుండి టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు. మేము తలచుకుంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తిరగలేరని హెచ్చరించారు. మేము, మా కార్యకర్తలు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడులోనే వుండి ప్రజలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పోలీస్ యంత్రాంగం ఎన్నికల నియమావళికి లోబడి నిరసన తెలుపుదామని బయలుదేరిన మమ్మల్ని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బలవంతంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Naga Chaitanya – Samantha : సమంతను కలిసిన నాగచైతన్య.. నేనున్నానంటూ భరోసా