Site icon NTV Telugu

TS PECET 2022 : ఈ నెల 11నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..

Ts Pecet

Ts Pecet

తెలంగాణ విద్యాశాఖ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, ఎడ్ సెట్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే తాజాగా టీఎస్ పీఈసెట్‌-2022 నోటిఫికేష‌న్‌ను మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ విడుద‌ల చేసింది. తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్‌(టీఎస్ పీఈసెట్‌)ను బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు రూ. 400, మిగ‌తా కేట‌గిరీల విద్యార్థుల‌కు రూ. 800గా ఫీజు నిర్ణ‌యించారు. ఇత‌ర వివ‌రాల కోసం www.pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని యూనివర్సటీ అధికారులు సూచించారు.

Exit mobile version