NTV Telugu Site icon

Summer Holidays: హమ్మయ్య.. సెలవులు వచ్చేశాయోచ్చ్‌..

Inter Holidyes

Inter Holidyes

Summer Holidays: ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో జూనియర్ కాలేజీ లకు వేసవి సెలవులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మళ్లీ జూన్ ఒకటి న కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో కాలేజీ లు తెరవద్దని అధికారులు సూచించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టాలని అన్నారు. సెలవుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, నవంబర్ 20 నుండి 25 వరకు హాఫ్ యర్లీ ఎగ్జామ్స్, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. మార్చి 2024 మొదట వారంలో ఇంటర్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యకు మొత్తం 227 పనిదినాలుంటాయని బోర్డు తెలిపింది.

తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2023-24) క్యాలెండర్..

* జూనియర్ కళాశాలల పునఃప్రారంభం: 01.06.2023.

* మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.

* దసరా సెలవులు: 19.10.2023 – 25.10.2023.

* దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.

* అర్ధ సంవత్సరం పరీక్షలు: 20.11.2023 – 25.11.2023.

* సంక్రాంతి సెలవులు: 13.01.2024 – 16.01.2024.

* సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.

* ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 – 29.01.2024.

* ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.

* ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.

* వేసవి సెలవులు: 01.04.2024 – 31.05.2024.

* అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2024 మే చివరి వారంలో

* 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన, కాలేజీల ప్రారంభంపై బోర్డు అధికారులు దృష్టి సారించారు. తెలంగాణలో ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. గత బుధవారం ఇంటర్ సెకండియర్ పరీక్షలు పూర్తయ్యాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు గాను 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పుడు విద్యార్థులు ఫలితాలపై దృష్టి సారిస్తున్నారు. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం మే మొదటి వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని భావిస్తున్న అధికారులు అప్పటికి ఫలితాల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Revanth reddy: తీగలాగితే డొంక కదిలిందా?! మీకర్థమవుతోందా?

Show comments