NTV Telugu Site icon

TS Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Hevy Rains

Telangana Hevy Rains

TS Heavy Rains: అల్పపీడనం కారణంగా నేడు, రేపు తూర్పు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు 13 జిల్లాకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ కు నేడు, రేపు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్ ఐఎండీ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Read also: Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు

హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 6-8 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, జియ్యమ్మవలస ప్రాంతాల్లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
MAD Song: ఈ సాంగ్ సింగిల్స్ అందరికీ అంకితం…