Site icon NTV Telugu

Gurukulam Entrance Test: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 8న ఎంట్రెన్స్ టెస్ట్..

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటీ పడుతున్నారు.. గురుకులాల్లో మంచి ఫలితాలు వస్తుండడంతో.. క్రమంగా అటు మొగ్గుచూపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలను గురుకులాల్లో వేసేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో, ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి అడ్మిషన్ కోసం పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. గురుకులాల్లో ప్రవేశాలకు ఈ నెల 8న ఎంట్రెన్స్ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఇక, ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 415 కేంద్రాలను ఏర్పాటు చేశారు.. ఈ ఏడాది లక్షా 48 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Read Also:  Miss India: అందాలపోటీపై వివరణ ఇచ్చిన శివానీ రాజశేఖర్!

Exit mobile version