NTV Telugu Site icon

New Mandals in Telangana: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు.. తుది నోటిఫికేషన్ జారీ

New Mandals In Telangana

New Mandals In Telangana

Formation of 13 new mandals in the state: తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజల అవసరాలు, పరిపాలనలో సౌలభ్యం కోసం మ‌రికొన్ని మండ‌లాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు ప‌లు జిల్లాల్లో కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మేర‌కు కొత్త మండ‌లాల‌కు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు పంపారు. తెలంగాణలో నూతన మండలాలు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిధిలో ఏర్పాటయిన నూతన మండలాలు ఇలా వున్నాయి. నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Read also: Sanju Samson: భారత జట్టుకి నిరసన సెగ.. అతని ఫ్యాన్స్ తాండవం

కొత్తగా ఏర్పడనున్న మండలాలు:

*జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం,
*సంగారెడ్డి- నిజాంపేట్,
*నల్గొండ- గట్టుప్పల్,
*మహబూబాబాద్- సీరోలు, ఇనుగుర్తి,
*సిద్దిపేట అక్బర్పేట-భూంపల్లి, కుకునూరుపల్లి,
*నిజామాబాద్ ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా,
*కామారెడ్డి డోంగ్లి,
*మహబూబ్ నగర్- కౌకుంట్ల మండలాలు ఏర్పాటయ్యాయి.
Minister Roja: షో కు పిలిచి అవమానించిన ఆది.. కంటతడి పెట్టిన రోజా

Show comments