వాహనదారులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం.. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు రాయతీపై చెల్లించుకునే గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. మరో సారి వెసులుబాటు కల్పించింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లపై రాయితీ అవకాశం ఉంది.. ఇవాళ్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్ల చలాన్లు క్లియర్ చేశారు.. వీటి విలువ 840 కోట్ల రూపాయలుగా ఉంది.. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడం ద్వారా 250 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరింది.. రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మోటారువాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని హోమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.
Read Also: TS: పెరిగిన ఎండల తీవ్రత.. పాఠశాలల సమయం కుదింపు..
అయితే, ఈ సమయంలో చెల్లించుకోలేకపోయినవారికి మళ్లీ అవకాశం ఇస్తూ.. మరో 15 రోజులు పొడిగించారు. దీంతో.. వాహనదారులు ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీపై పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు హోం మంత్రి మహ్మద్ అలీ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంమంత్రి తెలిపారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వెల్లడించారు.
