NTV Telugu Site icon

TS EAPCET Results 2024: ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ 10 లో..

Ts Eapcet Result 2024

Ts Eapcet Result 2024

TS EAPCET Results 2024: తెలంగాణ TAP APSET-2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఉదయం జెఎన్‌టియుహెచ్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువ క్వాలిఫై అయ్యారని తెలిపారు. టాప్ 10 లో ఒకే అమ్మాయి 10th ర్యాంక్ సాధించిందన్నారు. ఇంజనీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారన్నారు. వచ్చే వారంలో అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ రెండు కన్నా ముందే ఎంట్రెన్స్ జరిగింది కాబట్టి.. ఏపీ విద్యార్థులకు కూడా సీట్లు ఉంటాయన్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు అందరికీ సీట్లు ఉన్నాయి.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కంటే ఇంజనీరింగ్ లో అర్హత శాతం తగ్గిందన్నారు. అగ్రికల్చర్ , ఫార్మసీ స్ట్రీమ్ లో లక్ష 432 మంది దరఖాస్తు చేసుకుంటే 91 వేల 633 మంది అనగా.. 91.24% హజరయ్యారన్నారని తెలిపారు. 82 వేల 163 మంది క్వాలిఫై.. 89.7 శాతం క్వాలిఫై అయ్యారన్నారు.

Telangana EAMCET 2024 Results

Read also: TS EAPCET Results 2024:ఎంసెట్ రిజల్ట్ ఫాస్ట్ గా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 2 లక్షల 54 వేల 750 మంది దరఖాస్తు చేసుకోగా 2 లక్షల 40 వేల 618 మంది హాజరు… 94.45 శాతం హాజరయ్యారని వెల్లడించారు. లక్ష 80 వేల 424 మంది క్వాలిఫై , 75 శాతం క్వాలిఫై అయ్యారని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లోనే భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ముందే సీట్లు భర్తీ చేసుకున్నట్టు పిర్యాదులు వస్తె కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనిధి, గురునానక్ కాలేజ్ ల (ప్రైవేట్ వర్సిటీ) పై సీరియస్ చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. ఎప్ సెట్ కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారన్నారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారని, ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తామన్నారు. ఎంసెట్ ఫలితాలు ఎన్టీవీ వెబ్ సైట్ లో https://ntvtelugu.com/telangana-eamcet-results-2024 క్లిక్ చేసి వేగంగా చూసుకోవచ్చు.

Telangana EAMCET 2024 Results

CM Jagan London Tour: లండన్ పర్యటకు సీఎం జగన్‌.. ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్..!

Show comments