Site icon NTV Telugu

ఎంసెట్‌ తేదీలు ఖరారు

TS EAMCET

TS EAMCET

తెలంగాణలో ఎంసెట్ నిర్వహణ తేదీలు ఖరారు చేశారు.. కరోనా మహమ్మారి కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడుతూ రాగా… ఇవాళ టీఎస్ ఎంసెట్ తో పాటు వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్‌ (ఇంజినీరింగ్), ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) నిర్వహించనుండగా.. ఆగస్టు 11-14 వరకు పీజీ ఈ సెట్, ఆగస్టు 19,20 తేదీల్లో ఐ-సెట్, ఆగస్టు 23వ తేదీన లాసెట్, ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్, జులై 17న పాలిసెట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. ఈ సమావేశంలో విద్యాసంస్థల ప్రారంభం, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల పై ప్రత్యేకంగా చర్చించారు. ఇక జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల‌కు ప్రత్యక్ష త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించిన విష‌యం తెలిసిందే.. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు. కోవిడ్‌ కారణంగా పలు సార్లు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version