NTV Telugu Site icon

TS Corona Bulletin : కొత్త కేసులెన్నంటే..?

కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. యావత్త ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో 75 శాతం కోవిడ్‌ వాక్సిన్‌లు పంపిణీ చేసినా కూడా.. కరోనా ప్రభావం తగ్గలేదు. ఇదిలా ఉంటే కరోనా నుంచి కొత్తంగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మరోసారి భారీ పెరిగి భారత్‌లో థర్డ్‌ వేవ్‌కు దారి తీశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ నిబంధనలు కఠిన తరం చేయడం, నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ లాంటివి అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి.

అయితే తెలంగాణలో గడచిన 24 గంటల్లో 17,022 కరోనా పరీక్షలు నిర్వహించగా, 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 29 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,758 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,83,937 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,710 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.