NTV Telugu Site icon

Sabitha Indra Reddy: మంత్రి సబితా కీలక ప్రకటన.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌..

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్‌టీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పాఠశాల విద్యకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల కోసం పాఠశాలల్లో 1523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌, విధివిధానాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

Read also: Harish Rao: నర్సాపూర్ టికెట్ లొల్లి.. స్పందించిన మంత్రి

విద్యా రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా రంగానికి ఈ ఏడాది రూ.29,613 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురుకులాలు మనందరికీ గర్వకారణంగా నిలిచేలా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కళాశాల స్థాయికి అప్‌గ్రేడ్ చేశామన్నారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే 5,310 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. అన్ని స్థాయిల విద్యా సంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది.
Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!

TSPSC, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మరియు ఇతర బోర్డులు వేలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌లు, పరీక్షలతో దూసుకుపోతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేడు టీఆర్‌టీ నోటిఫికేషన్‌ రావడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
King of Kotha Review: కింగ్ ఆఫ్ కొత్త రివ్యూ

Show comments