TRSV Leaders Gun Fire: టీఆర్ఎస్వీ నాయకుల ఫైరింగ్ కలకలం.. రంగంలోకి పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRSV Leaders Gun Fire In Jitta Ravinder Farm House Creates Ruckuss: ఇటీవల ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్.. పోలీసులకు సంబంధించిన తుపాకీతో గాల్లో కాల్పులు చేసిన ఘటన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే! ఆ వ్యవహారం ఇంకా చల్లారక ముందే మరో ఫైరింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్వాతంత్ర దినోత్సవం రోజు.. నగర శివారు ప్రాంతంలో రాచకొండ మిర్ఖంపేట్ గెస్ట్ హౌస్‌లో టీఆర్ఎస్వీ నాయకులు గన్‌తో గాల్లో కాల్పులు జరిపారు. టీఆర్ఎస్వీ మండల ప్రెసిడెట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ కాల్పులు జరిపి.. ఆ దృశ్యాలను స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీంతో అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఆ వీడియోలను చూసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఎయిర్ గన్సా, లేక ఒరిజినల్ గన్సా అంటూ ట్రోల్ చేశారు. ఈ విషయం పోలీసుల దాకా చేరడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. గెస్ట్ హౌస్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆ నాయకులు కాల్పులు జరిపిన గన్న ఎయిర్ గన్‌గా గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిట్టా రవీందర్ రెడ్డి ఫార్మ్ హౌస్‌లోనే కాల్పులు జరిగాయని పోలీసులు చెప్తున్నారు. పుట్టినరోజు వేడుకల జోష్‌లో టీఆర్ఎస్వీ నాయకులు ఈ కాల్పులు జరిపినట్టు తేల్చారు. ఈ వేడుకలకి బడా బాబులు కూడా హాజరయ్యారట! ఆ గన్ ఎయిర్ గన్ మోడల్ 35 అని, గెస్ట్ హౌస్ వద్ద ఎయిర్ రైఫిల్ పెల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
- KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
- Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?
- Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
తాజావార్తలు
-
Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Rajini – Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
-
Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
-
Box Office Collections: నవంబర్‌లో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సందడి.. డ్రై సీజన్‌ను హిట్ల సీజన్‌గా మార్చిన సినిమాలు!
-
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!