Site icon NTV Telugu

ఎంపీ బండి సంజయ్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని హైదరాబాద్ నగరంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్న తరుణంలో ఆయన కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆయన నియోజకవర్గంలో కనిపించడం లేదని టీఆర్ఎస్ యూత్ విభాగం నేతలు సోమవారం నాడు సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also: షెడ్యూల్ ప్రకారమే… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి శూన్యమని టీఆర్ఎస్ యూత్ విభాగం నేతలు ఆరోపించారు. కనీసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, సర్వసభ్య సమావేశాలకు కూడా ఎంపీ బండి సంజయ్ హాజరుకావడం లేదని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ ఆచూకీని తమకు తెలిపాలని… ఆయన తన నియోజకవర్గానికి వచ్చి సమస్యలు పరిష్కరించాలని టీఆర్ఎస్ యూత్ విభాగం నేతలు డిమాండ్ చేశారు.

Exit mobile version