Site icon NTV Telugu

మీరు ఒకటి అంటే మేము పది అంటాం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర లో బిజెపి సీఎంలు ఏం చేస్తున్నారో చెప్పాలి. సంజయ్ యాత్రలో ప్రజలు ఎక్కడా లేరు… బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని తెలిపారు. ఇక 111 జీవో వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది… అది రాష్ట్రంకు సంబంధించిన విషయం కాదు. జితేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది బీజేపీ నేతలకు 111 జీవో పరిధిలో వందల ఎకరాల భూములు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ పై మాట్లాడుతే ఊరుకునేది లేదు… మీరు ఒకటి అంటే మేము పది అంటాము అని పేర్కొన్నారు.

Exit mobile version