Site icon NTV Telugu

Holi: హోలీ వేడుకల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే.. కార్యకర్తలకు మందు పోస్తూ చిందులు..

తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరోనా కారణంగో గత రెండేళ్లుగా సామూహిక వేడకలకు దూరమైన ప్రజలు.. ఈ సారి హోలీ పండుగను మంచి జోష్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అయితే, హోలీ వేడుకల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్.. చేతులో మందు బాటిల్‌ పట్టుకుని కార్యకర్తలతో కలిసి చిందులేశారు.. ఇక, మందు బాటిల్‌తో ఒక్కో కార్యకర్త దగ్గరకు వెళ్లి.. నేరుగా వారి నోట్లోనే మందు పోస్తూ జోష్‌గా కనిపించారు.. అయితే, హోలీ సందర్భంగా ప్రభుత్వం వైన్‌ షాపులను మూయిస్తే.. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మాత్రం.. హోలీ వేడుకల్లో కార్యకర్తల నోట్లో మందు పోస్తూ చిందులు వేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. బాధ్యతా యుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు.. ఇలాగా వ్యవహరించేది అంటూ మండిపడుతున్నారు.

Read Also: Ukraine Russia War: మరోసారి ఆస్పత్రికి జెలెన్‌స్కీ.. బాధితులకు పరామర్శ

Exit mobile version