Site icon NTV Telugu

మావోయిస్టులు వాడే భాషను రేవంత్ రెడ్డి వాడుతున్నారు !

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ ఫైర్‌ అయ్యారు. వివాదాల మధ్య రేవంత్.. పిసిసి అధ్యక్షుడయ్యాడని…రేవంత్ రాజకీయ ఎదుగుదల వివాదాస్పదమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం లో రాళ్లతో కొట్టాలని ఉందా.. అలా మాట్లాడితే చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిషేధించిన మావోయిస్టు పార్టీలో ఉండే వాళ్ళలా రేవంత్ మాట్లాడుతున్నారని.. రాజస్థాన్ లో ఆరుగురు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని చురకలు అంటించారు.

read also : తెలంగాణలో ఐఏఎస్‌ల పరిస్థితి విచిత్రం !

అవసరాల కోసం రేవంత్ పార్టీలు మారతారని మండిపడ్డారు. సమాచార హాక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసింది రేవంత్ అని… ఐపిసి 503, 506 సెక్షన్ల కింద కేసు పెట్టే లా రేవంత్‌ రెడ్డి కామెంట్స్ చేశారని నిప్పులు చెరిగారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తన మాటలు, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Exit mobile version