మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం వివాదంగా మారింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు.
మహిళలు కుదరదనడంతో.. వారిని తోసేసి బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారును పోనిచ్చారు. దీంతో మహిళలు అడ్డుకుని ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఎమ్మెల్యే అగౌరపరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తప్పుబట్టారు. గతంలో దళితులను అవమానించిన ఎమ్మెల్యే, ఇప్పుడు బతుకమ్మను కారుతో తొక్కించారని ఆయనది కుల అహంకరామంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రం బతుకమ్మ ఆడుతున్న మహిళలను అవమానపరచలేదంటున్నారు. మహిళలను గౌరవించి తాను కారు దిగి నడుచుకుంటూ వెళ్లానని ఆ సమయంలో తాను కోరులో లేనన్నారు. దళితులపై నోరుజారి ఇన్నాళ్లు ఇబ్బందిపడ్డ ధర్మారెడ్డి.. తాజాగా బతుకమ్మను అవమానపరిచి మరో వివాదంలో చిక్కుకున్నారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!