రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారని.. గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదని..వాని అబ్బ సొత్తు అసలే కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూతి లేదు తోక లేదు అన్నట్టు ఉంది రేవంత్ తీరు ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారి పై సైబర్ క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదు చేశానని…చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ తోనే ఉంటానని ప్రకటించారు దానం.
read also : పువ్వు అందంగా ఉందని వాసన చూసి…
తన ఇంటికి ఎవడు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందేనని.. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ లో భవిష్యత్ లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కింద ఎలా పని చేస్తారో కాంగ్రెస్ సీనియర్లు ఆలోచించుకోవాలన్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
