NTV Telugu Site icon

Bandi Sanjay: బీజేపీ జెండాను చూస్తే టీఆర్ఎస్ నేతలకు వణుకు

Bansi Sanjay

Bansi Sanjay

బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతారను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ మూకలు బరి తెగించి దాడికి పాల్పడటం హేయనీయమని మండిపడ్డారు.

జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతూ ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ శ్రేణులను ప్రజలు ఆదరిస్తుండటంతో టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులపై దాడులు చేస్తూ గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటెంటే చర్యలు తీసుకోవలసిన పోలీసులు టీఆరెస్ నేతలకు కొమ్ము కాస్తూ బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే అరెస్టయిన బీజేపీ నేతలను విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని బండిసంజయ్‌ మండిపడ్డారు.
Business Flash: టెస్లా అనూహ్య నిర్ణయం.. బిట్‌ కాయిన్‌లోని మేజర్‌ పెట్టుబడుల అమ్మకం