NTV Telugu Site icon

TRS Leders: ఇంకో ఐదు రౌండ్లు అయ్యే వరకు బీజేపీ లీడర్లు ఓపిక పట్టండి..

Ranjith Reddy Dasoju Sravan

Ranjith Reddy Dasoju Sravan

TRS Leders Ranjith reddy-Dasoju sravan: బీజేపీపై టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, టీఆర్ఎస్ లీడ‌ర్ దాసోజు శ్రవ‌ణ్ మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ అవాకులు చెవాకులు మాట్లాడుతోందిని రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని మేము అడుగుతున్నామన్నారు. కౌంటింగ్ పూర్తి అయితే ధూద్ కా ధూద్ పానికా పాని తెలుస్తుంది కదా అంటూ కౌంటర్‌ వేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. పోలింగ్ శాతంపై దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఇంకో ఐదు రౌండ్లు అయ్యే వరకు బీజేపీ లీడర్లు ఓపిక పట్టండని అన్నారు. దుబ్బాకలో మేము ఏమైనా మాట్లాడామా? అని ప్రశ్నించారు. ఒడిపోతుంది కాబట్టే బీజేపీ నాయకులు ముందస్తుగా ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఫర్ఫెక్ట్ నడుస్తోందని అన్నారు. ఎన్నికల కమిషన్ కేంద్రం చేతిలో ఉందని అందరికీ తెలుసని గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన చౌటుప్పల్ లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధించిందని గుర్తు చేశారు. మంత్రులందరూ కష్టపడ్డారని రంజిత్‌ రెడ్డి అన్నారు.

Read also: Jogi Ramesh – Meruga Nagarjuna: ఆ ఘనత ఒక్క జగన్‌కే సాధ్యం.. వాళ్ల శక్తి చాలదు

దాసోజీ శ్రవణ్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు సరిలీ చేస్తుంటే టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుమీద నడక అన్నట్లే కనిపిస్తోందని అన్నారు. బీజేపీ చిల్లర పదాలు వాడుతూ ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కౌంటింగ్ హల్ లో ప్రతీ టేబుల్ పై బీజేపీ ఏజెంట్ ఉన్నారు కదా? అని అన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు ధర్మబద్ధమైన గెలుపన్నారు. నైతికంగా గెలుపు అనే మాట వచ్చిందంటే బీజేపీ ఓడిపోతుందని అంగీకరించిందని ఎద్దేవ చేశారు. బీజేపీ బొక్కబోర్ల పడిందని అన్నారు. రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలనే బీజేపీ కుట్రను మునుగోడు ప్రజలు బ్రేక్ వేశారని అన్నారు. 18వేల కోట్ల కాంట్రాక్టర్ కు చరమగీతం మునుగోడు ఫలితం కానుందని అన్నారు. చిల్లర ప్రయత్నాలతో బీజేపీ మైండ్ గేమ్ ఆడేందుకు కుట్ర చేయబోతోందని ఆరోపించారు.
BJP Manifesto: అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తాం.. వక్ఫ్ భూములపై విచారణ