తెలంగాణపై బీజేపీకి ఉన్న వ్యతిరేక భావన బయటపడిందని టీఆర్‌ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌లో ఉన్న గనులు.. ప్రభుత్వ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేసింది. కానీ తెలంగాణలో బొగ్గు బ్లాకులు మాత్రం ఇక్కడి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వడం లేదన్నారు. బొగ్గు బ్లాకులు ఇక్కడి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణలో సింగరేణి సంస్థను దెబ్బ తీయడం కోసమే కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్నారు. తెలంగాణలో విద్యుత్ అంతరాయం కలిగించే చర్యలను కేంద్రం చేయాలని చూస్తోంది.
బొగ్గు గనులను అదానీకి కట్టబెట్టే కుట్ర ఒకటి జరుగుతుందని బాల్క సుమన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను హోల్ సేల్ గా అమ్మే కుట్రకు తెరతీసిందన్నారు. గురువు అయిన అద్వానీ ముంచినోళ్లు బీజేపీ నేతలు అని మండిపడ్డారు. అద్వానీ నీ ముంచి అదానీలను పెంచుతున్నారన్నారు. తెలంగాణకు మిషన్ భగీరథ నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాల్క సుమన్ అన్నారు. యూపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. నదుల అనుసంధానం పేరుతో రూ.36 వేల కోట్లు ఇచ్చిందని దుయ్యబట్టారు. అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇస్తున్నారు. తెలంగాణకు ఐటీఐఆర్ రద్దు చేయకుండా ఉంటే వేల ఉద్యోగాలు వచ్చేవి. తెలంగాణ యువత నోట్లో మట్టికొట్టే పనిలో బీజేపీ నేతలు బీజీగా ఉన్నారని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు.
