NTV Telugu Site icon

నాకు 2 గుంటల భూమే ఆస్తి.. పని మనిషిలా పని చేస్తా..

Gellu Srinivas Yadav

Gellu Srinivas Yadav

నాకు కేవలం 2 గుంటల భూమే ఆస్తి.. ఓ పని మనిషిలా పని చేస్తా.. అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని హుజురాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో.. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్.. స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… నాకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలకు సేవ చేయమన్న సీఎం కేసీఆర్ కి పాదాభివందనం అన్నారు.. నేను పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను.. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశాను… కేసీఆర్‌ ఉద్యమ స్ఫూర్తితో పనిచేశానని వెల్లడించారు.. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసినందుకు సీఎం కేసీఆర్ నన్ను గుర్తించారు… అందుకే టికెట్‌ ఇచ్చారన్నారు… ఇక, నన్ను గెలిపించండి… అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా.. ఒక పని మనిషిలా పని చేస్తాను అని విజ్ఞప్తి చేశారు గెల్లు శ్రీనివాస్.