Tribute for NTV Reporter Zameer.
తుఫాను వరదల్లో చిక్కుకున్న ప్రజల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వారిని రక్షించే ప్రయత్నంలో విధి నిర్వహణలో భాగంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల రిపోర్టర్ జమీర్ కు హుజురాబాద్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ TUWJ(IJU) ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల తో నివాళ్ళర్పించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ (TUWJ – IJU) ఎలక్ట్రానిక్ మీడియా నియోజక వర్గా జర్నలిస్టుల ఆధ్వర్యంలో జగిత్యాల ఎన్టీవీ విలేకరి మహమ్మద్ జమీర్ కి రిపోర్టర్లు ఘన నివాళులు అర్పించారు. ప్రెస్ క్లబ్ నుంచి విలేకరులు ర్యాలీగా పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకున్నారు. జర్నలిస్ట్ జమీర్ కి జోహార్ జోహార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలంటూ2 నిమిషాలు మౌనాన్ని పాటించారు. అంబేద్కర్ కూడలి వద్ద జమీర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కోవొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. జగిత్యాల జిల్లా రాయికల్ లో వార్త సేకరణ లో ప్రమాదవశాత్తు జమీర్ మృతి చెందటం బాధాకరమని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు,కార్యదర్శి గడ్డం ధర్మారెడ్డి, నర్సింహ రెడ్డి ఎలక్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు కార్యదర్శి సయ్యద్ మక్సూద్, దూలం ఆంజనేయులు నాయకులు కుమార్,అజీమ్,గణేష్, శ్రీనివాస్,మధుకర్ చందు,కిరణ్,మహేష్,శ్రీధర్,రవి సతీష్,, ఫాహిం, ముజాహిద్,తిరుపతి పాల్గొన్నారు.
శ్రీకాకుళం: విధి నిర్వహణలో అశువులుబాసిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కోవొత్తుల వెలిగించి నివాళులర్పించారు జర్నలిస్టులు. విధి నిర్వహణలో అసువులు బాసిన ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి జమీర్ కు టెక్కలి ప్రెస్ క్లబ్ ఘనంగా నివాళులు అర్పించారు. టెక్కలి మండలం టెక్కలి లో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశమైన ప్రెస్ క్లబ్ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తూ జమీర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు .ఈ సందర్భంగా జమీర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి నరసింగరావు, ఉపాధ్యక్షుడు గోపీనాథ్, కార్యదర్శి రాజు, ఎల్ రమణ, అభి, ప్రవీణ్ ,వినాయక రావు, రఘు, భాస్కర్, భాను తదితర విలేకరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ లో మన ఎన్టీవీ కుటుంబ సభ్యుడు వార్త కవరేజ్ కి వెళ్లి గల్లంతయి చనిపోయిన జమీర్ కు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ఘన నివాళులర్పించారు అలాగే చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ గుండు శేఖర్ నివాళులర్పించారు రెండు నిమిషాల మౌనం పాటించి చిత్రపటానికి పూల పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొన్నారు.
