దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ కోతలు తప్పడంలేదని చెబుతున్నారు.. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరిపోతోంది.. అయితే, వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో కోతలు మొదలయ్యాయి.. నిన్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.. ఇక, రాత్రిపూట సింగిల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయనున్నారని సమాచారం.. ఈ మేరకు జిల్లాల వారీగా త్రీఫేజ్ విద్యుత్‌కు సంబంధించి షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు..
Read Also: Pending Challan: త్వరపడండి.. ఇవాళ్టితో ముగియనున్న భారీ డిస్కౌంట్ ఆఫర్
విద్యుత్ కోతలపై స్పందించిన సీఎండీ ప్రభాకర్ రావు.. నిన్న కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు.. ఎన్‌పీడీసీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపంతో వ్యవసాయ రంగ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.. కానీ, ఇవాళ్టి నుంచి రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. రైతన్నలు ఎవరు ఆందోళన చెందల్సిన అవసరం లేదన్నారు.. ఇన్ని రోజులు ఏ విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉంటుందని తెలిపారు ట్రాన్స్‌కో, జెన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు.