NTV Telugu Site icon

Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్‌.. వివరాలు ఇవే..

Trains Cancelled

Trains Cancelled

Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో ఇవి నిన్నటి నుంచి నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. సాంకేతిక సమస్యల వివరాలు ప్రకటించనప్పటికీ, సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క ఆధునీకరణ జరుగుతుందని భావిస్తున్నారు. బాలాసోర్ వద్ద కోరమాండల్ విపత్తును దృష్టిలో ఉంచుకుని, అధికారులు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు.

Read also: Drinking Beer: బీర్లు తాగాడు.. లక్షాధికారి అయ్యాడు.. అదెలా?

వివరాలు ఇవే..

* 17003 కాజీపేట-కాగజ్‌నగర్ రైలు ఈ నెల 17 నుండి జూలై 6 వరకు రద్దు చేయబడింది.
* 12757/58 కాగజ్నా గర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23 నుండి ఈ నెల 6 వరకు రెండు వైపులా రద్దు చేయబడింది.
* 12967 చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జూలై 2,7 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21,23,28,30, జూలై 5న రద్దు చేయబడింది.
* 12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జూలై 4, 6 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12539 యశ్వంత్‌పూర్-లక్నో ఈ నెల 26, జూలై 3న రద్దు చేయబడింది.
* 12540 లక్నో-యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జూలై 5 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12577 భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు చేయబడింది.
* 22619 బిలాస్‌పూర్-త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జూలై 2 రద్దు చేయబడింది.
* 22620 త్రివేండ్రం-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేయబడింది.
* 22352 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జూలై 5వ తేదీల్లో రద్దు చేయబడింది.
* 22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జూలై 1, 8 తేదీల్లో రద్దు చేయబడింది.
Kaleshwaram Project: వివరాలు ఇవ్వండి.. నిర్మాణ సంస్థలను కోరిన జస్టిస్‌ పినాకి..