NTV Telugu Site icon

Flight Crash: తుఫ్రాన్ లో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు సజీవ దహనం..?

Flight Crash In Medak

Flight Crash In Medak

Flight Crash: మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం రావెల్లిలో శిక్షణ విమానం కూలిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో పెద్ద శబ్ధంతో విమానం కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. విమానం కూలిపోవడంతో ఒక్కసారి భారీగా మంటలు చెలరేగాయి. తుఫ్రాన్ సమీపంలోని రావెల్లి కొండల్లో శిక్షణ విమానం కూలిపోయింది. పెద్ద శబ్ధం రావడంతో సమీపంలో పని చేస్తున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే విమానం పూర్తిగా మంటల్లో కాలిపోవడంతో దాని దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Read also: Muthu Re-release : ముత్తు రీ రిలీజ్ ను పట్టించుకోని ప్రేక్షకులు.. రీ రిలీజ్ ట్రెండ్ ముగిసినట్టేనా..?

ఘటన స్థలానికి హెలికాప్టర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం దుండిగల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన శిక్షణ విమానంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. సాంకేతిక లోపం కారణంగా శిక్షణ విమానం కూలినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైనీ పైలట్లు ప్రమాదం నుంచి బయటపడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలకు అంతరాయం