Muthu Re-release : ముత్తు రీ రిలీజ్ ను పట్టించుకోని ప్రేక్షకులు.. రీ రిలీజ్ ట్రెండ్ ముగిసినట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు. 28 ఏళ్ల కిందట విడుదల అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అంతా భావించారు.అలాగే రీరిలీజ్ తేదీని కూడా చాలా రోజుల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తీరా రిలీజ్ సమయానికి మాత్రం షోలన్నింటినీ రద్దు చేయాల్సి వచ్చింది.ముత్తు సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా లేదు. అసలు టికెట్లు అమ్ముడుపోకపోవడంతో అన్ని షోలనూ కూడా రద్దు చేశారు. గత కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే..ముఖ్యంగా తెలుగు లో పెద్ద హీరోలు మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి వాళ్ల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి.కొన్ని సినిమాలు సంచలన వసూళ్లు సాధించగా.. మరికొన్ని చూసేవాళ్లు లేక షోలు రద్దు చేయాల్సి వచ్చింది.
తాజాగా రజనీకాంత్ ముత్తుకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. 1995లో రిలీజైన ఈ సినిమా తమిళనాడులో 175 రోజులు ఆడి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత జపాన్ లో కూడా రిలీజై ఊహించని విజయం సొంతం చేసుకుంది.అయితే ఈ ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉండటంతో ముత్తు సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావించారు. కానీ అంతా రివర్సయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకపోవడంతో షోలను రద్దు చేయాలని థియేటర్లు యజమానులు నిర్ణయించారు.రీసెంట్ గా ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ మూవీ రీ రిలీజ్ అయింది.. ఆ సినిమాకు ఆదరణ అంతగా లభించలేదు.. దీనితో రీ రిలీజ్ ట్రెండ్ ముగిసినట్టే అని అంతా భావిస్తున్నారు.. ఇదిలా ఉంటే రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12) నేపథ్యంలో డిసెంబర్ 9న అతని మరో హిట్ మూవీ శివాజీ ది బాస్ రీరిలీజ్ కానుంది.ముత్తు సినిమాను పట్టించుకోని ప్రేక్షకులు మరి శివాజీ మూవీని అయిన ఆదరిస్తారో లేదో చూడాలి..
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- Tags
- #muthu
- #rajanikanth
- re release
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!